మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారో చర్చకు సిద్ధమా?: ఏపీ నేతలకు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సవాల్

  • కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు?
  • మేమేమీ మీలాగా రూపాయి పెట్టి కోట్లు తినట్లేదు
  • సినీ పరిశ్రమపై నిందలు వేసిన వారు తలలు దించుకోవాలంటూ కామెంట్
సినీ పరిశ్రమపై ఏపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఇవాళ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుల ప్రస్తావన లేకుండా అందరికీ ఉపాధి కల్పిస్తున్న ఏకైక రంగం సినీ పరిశ్రమేనని, అలాంటి పరిశ్రమపై నిందలు వేసిన నాయకులు తలలు దించుకోవాలని ఆయన మండిపడ్డారు. సినిమా విషయంలో కులాలు, మతాలు ఎందుకంటూ ప్రశ్నించారు.

‘‘పుష్ప నిర్మాతలు ఫలానా కులానికి చెందిన వారు కాబట్టే.. ఇంకో కులానికి చెందిన వారిని ఆ సినిమాలో తిట్టారని చాలామంది విమర్శిస్తున్నారు. గతంలో కొందరు నేతలు ఇలాగే రెచ్చిపోయి మాట్లాడారు. వాళ్లు గడ్డితిన్నారని.. మీరూ గడ్డి తింటారా? మీకు ఒక కులపు వారు ఓట్లేస్తేనే గెలవలేదు. అన్ని వర్గాల వాళ్లు వేస్తేనే గెలిచారు. ఇష్టమొచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్లు అంత లోకువ అయిపోయారా?’’ అంటూ ప్రశ్నించారు.

మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా? అని నిలదీశారు. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆస్తులెన్ని? ఇప్పుడెన్ని? అని ప్రశ్నించారు. వందల మంది కష్టపడితే వచ్చే ప్రాజెక్టు సినిమా అని అన్నారు. తామేమీ రాజకీయ నాయకుల్లాగా రూపాయి పెట్టి కోట్లు తినట్లేదన్నారు.


More Telugu News