రాజధానిలో కుదుటపడిన కొత్త కేసులు.. రెండు మూడు రోజుల్లో ఆంక్షల ఎత్తివేత: ఢిల్లీ రాష్ట్ర మంత్రి సత్యేంద్ర జైన్

  • కేసుల్లో నిలకడ వచ్చింది
  • రెండు మూడు రోజుల్లో తగ్గుముఖం
  • ముంబైలో ఇదే కనిపించింది
కరోనా కొత్త కేసులు వచ్చే రెండు రోజుల పాటు తగ్గుముఖం పడితే ఢిల్లీలో ఆంక్షలను ఎత్తివేస్తామని రాష్ట్ర వైద్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ‘‘గడిచిన 24 గంటల వ్యవధిలో 25,000 వరకు కేసులు వచ్చాయి. పాజిటివ్ రేటు ఆధారంగా కేసులు పీక్ కు చేరాయని చెప్పలేము. ప్రస్తుతం 25 శాతం పాజిటివ్ రేటు కొనసాగుతోంది.

మరోపక్క కరోనా కొత్త కేసులు స్థిరంగా ఉన్నాయి. త్వరలోనే తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలోనూ నిలకడ కనిపిస్తోంది. చాలా పడకలు ఖాళీగా ఉన్నాయి. ముంబైలో ఇప్పటికే కేసులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితిని చూస్తాం’’అని సత్యేంద్ర జైన్ ఓ వార్తా సంస్థతో అన్నారు.


More Telugu News