'నువ్వు పెళ్లి చేసుకుంటే వాడు రాముడవుతాడమ్మా' .. 'సూపర్ మచ్చి' ట్రైలర్!
- కల్యాణ్ దేవ్ నుంచి 'సూపర్ మచ్చి'
- కథానాయికగా రచిత రామ్
- కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్
- ఈ నెల 14వ తేదీన విడుదల
కల్యాణ్ దేవ్ హీరోగా 'సూపర్ మచ్చి' సినిమా రూపొందింది. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాకి పులి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రచిత రామ్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబై కొంతకాలంగా సరైన డేట్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ నెల 14వ తేదీన థియేటర్లకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను వదిలారు. ఈ కథలోని వివిధ కోణాలను ట్రైలర్ ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా చేసుకుని కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ కథలో హీరోయిన్ ప్రేమని పొందలేకపోయిన అజయ్ .. విలన్ గా మారతాడని అర్థమవుతోంది.
రాజేంద్రప్రసాద్ .. తనికెళ్ల భరణి .. పోసాని .. ప్రగతి వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాకి మరో బలమనే చెప్పాలి. "వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సీతవు అవుతావో లేదో నాకు తెలియదు గానీ, వాడు మాత్రం రాముడు అవుతాడమ్మా" అనే రాజేంద్రప్రసాద్ డైలాగ్ బాగా పేలింది. ఈ సినిమా కల్యాణ్ దేవ్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.