తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమ సహకరించలేదు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమ సహకరించలేదు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ అధినేత సంచలన వ్యాఖ్యలు
  • తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని వెల్లడి
  • సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా అదే తంతు అని వివరణ
  • టికెట్ల అంశంలో తమనెందుకు లాగుతున్నారని ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సినిమా టికెట్ల అంశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమ ఎప్పుడూ సహకరించలేదని అన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు వచ్చాయని ఆరోపించారు. అయితే, వైసీపీ నేతలు తమను సినిమా టికెట్ల వివాదంలోకి లాగుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కారణంగా తమకు విజయం దూరమైందని విశ్లేషించారు. చిరంజీవి పార్టీ పెట్టకపోతే తామే గెలిచేవాళ్లమని అన్నారు. అయితే, చిరంజీవితో అప్పుడు, ఇప్పుడు తనకు సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.


More Telugu News