మూడో టెస్టు: లంచ్ విరామానికి టీమిండియా స్కోరు 75/2

  • కేప్ టౌన్ వేదికగా మూడో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • పిచ్ పై బౌన్స్ తో టీమిండియా ఓపెనర్ల తడబాటు
  • 33 పరుగులకే ఓపెనర్లు అవుట్
కేప్ టౌన్ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా లంచ్ విరామ సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15) ఆరంభంలోనే పెవిలియన్ చేరారు. న్యూలాండ్స్ మైదానంలో పిచ్ పై విపరీతమైన బౌన్స్ లభిస్తుండడంతో భారత ఓపెనర్లు తడబాటుకు గురయ్యారు. సఫారీ సీమర్లు సరైన ప్రదేశాల్లో బంతులు సంధిస్తుండడంతో ఏ నిమిషమైనా అవుటయ్యేలా కనిపించారు. చివరికి ఒలివర్ బౌలింగ్ లో రాహుల్, రబాడా బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ వెనుదిరిగారు.

33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఛటేశ్వర్ పుజారా (26 బ్యాటింగ్), కెప్టెన్ విరాట్ కోహ్లీ (15 బ్యాటింగ్) జోడీ ఆదుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తెలిసిందే.


More Telugu News