ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో బాలకృష్ణ 'అన్ స్టాపబుల్'.. 10వ స్థానంలో ఐశ్వర్య రాయ్ షో!
- రేటింగ్ ను వెలువరించిన ఐఎండీబీ
- రెండో స్థానంలో 'ది కపిల్ శర్మ షో'
- పదో స్థానంలో ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న 'అమెజాన్ ఫ్యాషన్ అప్'
నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లోనే తొలిసారిగా చేస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్' దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ షో ఎనిమిది ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ఈ షోను బాలయ్య తనదైన శైలితో నిర్వహిస్తూ రక్తి కట్టిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ కూడా టాప్ రేటింగ్ ను నమోదు చేస్తోంది. ఇప్పుడు ఇండియాలోనే ఈ టాక్ షో తొలి స్థానంలో నిలిచింది.
ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 పాయింట్లతో 'అన్ స్టాపబుల్' అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండో స్థానంలో కపిల్ శర్మ నిర్వహిస్తున్న 'ది కపిల్ శర్మ షో' నిలిచింది. ఈ షోకు 7.8 పాయింట్లు దక్కాయి. ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న 'అమెజాన్ ఫ్యాషన్ అప్' షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అన్ని టీవీ సిరీస్ లలో టాప్ 50 షోలను సెలెక్ట్ చేయగా... అందులో బాలయ్య షో అగ్ర స్థానంలో నిలిచింది.
ఐఎంబీడీ సంస్థ సినిమాలు, టీవీ సిరీస్ లు, టాక్ షోలకు రేటింగ్ ఇస్తుంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న లెక్కల ద్వారా గ్రేడింగ్ ఇస్తుంది. అంతేకాదు, ప్రేక్షకుల రేటింగ్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విధంగా ఇచ్చిన రేటింగ్స్ లో బాలయ్య షో తొలి స్థానంలో నిలిచింది. మరోవైపు బాలయ్య తాజా చిత్రం 'అఖండ' కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.