కేప్ టౌన్ లో మూడో టెస్టు... టాస్ గెలిచిన టీమిండియా
- బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- సిరీస్ లో 1-1తో సమవుజ్జీలుగా ఉన్న ఇరుజట్లు
- నిర్ణయాత్మకంగా మారిన చివరి టెస్టు
- సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ కు చోటు
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో చివరి టెస్టు నేటి నుంచి జరగనుంది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్ లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మూడో టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ నెగ్గే అవకాశం ఇప్పుడు టీమిండియా ముందర నిలిచింది.
అటు, ఎల్గార్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు రెండో టెస్టులో స్ఫూర్తిదాయక విజయం సాధించి ఊపుమీదుంది. కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్ను నొప్పి నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన నేపథ్యంలో, హనుమ విహారిని తుది జట్టు నుంచి తప్పించారు. ఇక, కండరాల గాయంతో బాధపడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ కు చోటిచ్చారు.