నాకు, అకీరాకు కరోనా సోకింది.. ఈ థర్డ్ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోండి: రేణూ దేశాయ్
- కరోనా సమయంలో ఇంట్లోనే ఉన్నాం
- న్యూ ఇయర్ వేడుక సమయంలోనూ ఇంట్లోనే కూర్చున్నాం
- అయినప్పటికీ కరోనా లక్షణాలు కనపడ్డాయి
- మాస్క్ ధరిస్తూ, జాగ్రత్తగా ఉండండంటున్న రేణు
సినీ నటి రేణూ దేశాయ్‌తో పాటు ఆమె కుమారుడు అకీరాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. 'హలో.. కరోనా సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ.. న్యూ ఇయర్ వేడుక సమయంలోనూ ఇంట్లోనే కూర్చున్నప్పటికీ నాలోను, అకీరాలోను కరోనా లక్షణాలు కనపడ్డాయి.. పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఇద్దరం కరోనా నుంచి కోలుకుంటున్నాం' అని రేణూ దేశాయ్ వివరించారు.
'నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే.. ప్రతి ఒక్కరు థర్డ్ వేవ్ ను సీరియస్‌గా తీసుకోండి. మాస్క్ ధరిస్తూ వీలైనంత జాగ్రత్తగా ఉండండి. నేను గత ఏడాది వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఇప్పుడు అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దామని అనుకునే సమయంలో అతడికి కరోనా సోకింది' అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.
కాగా, ఇప్పటికే మహేశ్ బాబు, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేశ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారు తమ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుని చికిత్స తీసుకుంటున్నారు.