ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వ‌ర్షాలు

  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
  • నిర్మల్ తో పాటు నేరడిగొండ, బజార్ హత్నూరలో వాన‌
  • పంట‌లు న‌ష్ట‌పోయే ముప్పు
తెలంగాణ‌లో ప‌లు ప్రాంతాల్లో అకాల వ‌ర్షాలు కురుస్తోన్న విష‌యం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మ‌ళ్లీ పడింది. నిర్మల్ తో పాటు నేరడిగొండ, బజార్ హత్నూర, ముథోల్, సారంగపూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్ మండలాల్లో వ‌ర్షం ప‌డుతోంది. ఆయా ప్రాంతాల్లో శనగ, గోధుమ, జొన్న పంట‌లు న‌ష్ట‌పోయే ముప్పు ఉండ‌డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులకు పంటలు నేలకొరిగాయని చెప్పారు.

కాగా, మ‌రో రెండు రోజులు తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్ర‌క‌టించింది. రేపు ప‌లు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్‌ జిల్లాలో కూడా వ‌ర్షాలు కురిసిన విష‌యం తెలిసిందే.


More Telugu News