సల్మాన్ ఖాన్ తో డేటింగ్ వార్తలపై స్పందించిన అమెరికా నటి సమంత
- ప్రజలు లేని దాని గురించి కూడా చెప్పగలరు
- ఈ వార్తలు ఎలా వచ్చాయో నాకు తెలియదు
- సల్మాన్ మంచి వ్యక్తి
సెలబ్రిటీలకు సంబంధించి, ముఖ్యంగా నటీనటుల గురించి ఎప్పుడూ ఎవో పుకార్లు, వదంతులు వినిపిస్తుంటాయి. బాలీవుడ్ సీనియర్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్, అమెరికా నటి సమంత లాక్ వుడ్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. పాన్వెల్ లోని వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల జరిగిన సల్మాన్ జన్మదిన వేడుకల్లోనూ ఆమె పాల్గొనడం ఊహాగానాలను మరింత పెంచింది. దీనిపై మీడియా ప్రతినిధులు నేరుగా ’షూట్ ది మూవీ‘ చిత్ర కథానాయిక అయిన సమంతనే అడిగేశారు.
‘‘ప్రజలు చాలా మాట్లాడుతుంటారు. లేని దాని గురించి చాలానే చెప్పగలరు. నేను సల్మాన్ ఖాన్ ను కలుసుకున్నాను. ఆయన మంచి వ్యక్తి. చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. ప్రజలకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను కలవడం అంటే.. హృతిక్ రోషన్ ను కూడా కలుసుకున్నాను. కానీ, నా గురించి, హృతిక్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈ వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు’’ అని స్పష్టం చేసింది. గత నెలలో హృతిక్ రోషన్ తో తీసుకున్న సెల్ఫీని సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకోవడం తెలిసిందే.