దేశంలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. అప్డేట్స్ ఇవిగో
- కొత్తగా 1,68,063 కరోనా కేసులు
- నిన్న కరోనాతో 277 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతం
- ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,461
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, దేశంలో నిన్న 69,959 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనాతో 277 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 8,21,446 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,461కు పెరిగింది. నిన్నటి వరకు మొత్తం 69,31,55,280 కరోనా పరీక్షలు చేశారు. నిన్న ఒక్కరోజే 15,79,928 కరోనా పరీక్షలు నిర్వహించారు.