కరోనా బారినపడిన బీహార్, కర్ణాటక ముఖ్యమంత్రులు

  • బీహార్ లో కరోనా తీవ్రం
  • గత వారం నితీశ్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా
  • తాజాగా సీఎంకు కూడా కరోనా నిర్ధారణ
  • హోం ఐసోలేషన్ లో నితీశ్ కుమార్
  • కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి కరోనా 
  • స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న బొమ్మై
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడంలేదు. తాజాగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని, వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని సీఎంవో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని తెలిపింది.

కాగా, గతవారం నితీశ్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా సోకింది. వారిలో ఆరుగురు సీఎం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతావారు వంటవాళ్లు. గత మంగళవారం పలువురు మంత్రులు, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. గత కొన్నిరోజులుగా బీహార్ లో కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. గడచిన 24 గంటల్లో బీహార్ లో 5,022 కొత్త కేసులు నమోదయ్యాయి.

అటు, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని బొమ్మై వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు.


More Telugu News