దగ్గుతో బాధపడుతున్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్... కరోనా పరీక్షలకు నిరాకరణ

  • మేకెదాటు నీటి ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పాదయాత్ర
  • డీకే శివకుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభం
  • దగ్గుతూ కనిపించిన శివకుమార్
  • కరోనా పరీక్షలు చేసేందుకు వెళ్లిన ఆరోగ్య సిబ్బంది
  • తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడి
కర్ణాటకలో మేకెదాటు తాగునీటి ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ భారీ పాదయాత్రకు తెరదీసింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆధ్వర్యంలో రామ్ నగర్ జిల్లా నుంచి మొదలైన ఈ పాదయాత్ర బెంగళూరులో ముగియనుంది. 100 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరగనుంది.

కాగా, ఆదివారం పాదయాత్ర షురూ అయిన సందర్భంగా డీకే శివకుమార్ దగ్గుతో బాధపడుతూ కనిపించారు. దాంతో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆయనకు కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ శివకుమార్ కరోనా పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించలేదు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు కరోనా పరీక్షలు అవసరంలేదని స్పష్టం చేశారు.

అటు, కరోనా సమయంలో భారీ పాదయాత్ర అవసరమా అంటూ అధికార బీజేపీ మండిపడుతుండడంతో, శివకుమార్ కూడా బదులిచ్చారు. నాడు, సీఎం ప్రమాణ స్వీకారం చేసిన సయయంలో 5 వేల మంది పాల్గొంటే కరోనా వ్యాప్తి జరగలేదు కానీ, ఇప్పుడు కరోనా వ్యాప్తి జరుగుతుందా? అని ప్రశ్నించారు.


More Telugu News