తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- నిజామాబాద్, ఆదిలాబాద్‌లో కురుస్తోన్న వర్షాలు
- మరో 3 రోజుల పాటు తెలంగాణలో వానలు
- ప్రకటించిన వాతావరణ కేంద్రం
తెలంగాణలో మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, ఈ నెల 12వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వివరించింది.
ప్రస్తుతం ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రంలోకి ఉపరితల గాలులు వీస్తున్నాయని తెలిపింది. మరోవైపు, నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఆ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. అలాగే, ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.