ఇది మామిడి స్పెషల్ వైన్.. యూపీలో తయారీ
- దశేరి పండ్లతో ఎక్సైజ్ శాఖ ప్రయోగం
- ద్రాక్ష పండ్లు లేకపోవడమే కారణం
- ప్రభుత్వం అనుమతిస్తే యూనిట్ల ఏర్పాటు
వైన్ రుచిని ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. ఆ రుచికి ప్రధానంగా ద్రాక్ష పండ్లే కారణం. పండ్లను పులియబెట్టి ప్రత్యేక విధానంలో వైన్ ను తయారు చేస్తారు. కానీ, యూపీలో మామిడి పండ్లతో వైన్ ను తయారు చేశారు. ద్రాక్ష పండ్ల సాగు అక్కడ సరిపడా లేకపోవడం.. మామిడి సాగు గణనీయంగా ఉండడమే ఈ నూతన ప్రయత్నానికి నేపథ్యంగా ఉంది.
విరివిగా లభించే మామిడి, ఇతర పండ్లతో అక్కడ వైన్ తయారీ చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఇక మామిడి వైన్ పొంగి పొర్లుతుంది. పెద్ద ఎత్తున మామిడి వైన్ తయారీకి యూనిట్లను ఏర్పాటు చేయాలన్నది ఎక్సైజ్ శాఖ ఆలోచన. స్థానికంగా పండే ప్రముఖ మామిడి రకం దశేరి పండ్లను వైన్ తయారీకి వినియోగించాలన్నది ఎక్సైజ్ శాఖ ప్రణాళిక. మామిడి వైన్ వినియోగం ఎప్పటి నుంచో ఉంది. యూపీలో మాత్రం ఇదే మొదటిసారి.