ఉద్యోగుల కాలికి ముళ్లు దిగితే మునిపంటితో తీస్తానన్నారు కదా?: షర్మిల
- బంగారు తెలంగాణ పేరుతో అసమర్థ పాలన
- రాష్ట్రాన్ని చావుల కాష్ఠంగా తయారు చేశారు
- ఉద్యోగుల ఉసురు తీసుకుంటున్న చేతకాని ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఈ చేతగాని ముఖ్యమంత్రి మనకి వద్దు అంటూ ట్వీట్ చేశారు.
'అయితే నిరుద్యోగులు, లేకపోతే రైతులు, కాకపోతే ఉద్యోగులు.. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని చావుల కాష్ఠంగా తయారు చేసిన హంతకుడు కేసీఆర్. ఒకవైపు రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే, మరోవైపు జీవో. 317 ఉద్యోగుల ఊపిరి తీస్తుంటే.. దొరకు మాత్రం ఆ చావులను ఆపాలనే సోయి రావడం లేదు' అని ఆమె విమర్శించారు.
'రైతు సంక్షేమం అంటే రైతులు పురుగుల మందు తాగి చచ్చేలా చేయడమా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగుల కాలికి ముళ్లు దిగితే మునిపంటితో తీస్తాను అంటే వారిని సొంత ఊరునుంచి వెళ్లగొట్టి చంపడమా? ఉద్యోగుల ఉసురు తీసుకుంటున్న చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు' అని షర్మిల విమర్శలు గుప్పించారు.