సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరల పెంపు
- పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని పెంపు
- సికింద్రాబాద్‌లో రూ.10 నుంచి రూ.50కి పెంపు
- మిగతా అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లలో పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు వెల్లడించింది.
మిగతా అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ధరలు ఈ నెల 20 వరకు కొనసాగుతాయని వెల్లడించింది.
కాగా, పండుగ రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అనవసర రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోపక్క, ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ మొదలైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది.