తెలంగాణలో ఈ నెల 20 వరకు కొవిడ్ ఆంక్షల పొడిగింపు

  • ఆంక్షలు పొడిగిస్తూ ఉత్తర్వులు
  • ర్యాలీలు, మతపరమైన కార్యమాలపై నిషేధం
  • శరీర ఉష్ణోగ్రతను చెక్ చేశాకే లోపలికి అనుమతించాలని ఆదేశం
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉన్న ఆంక్షలను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో గత నెల 25న ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేటితో ఆంక్షల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 25 వరకు వీటిని పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభలు, ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాలతోపాటు రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రజా రవాణా, దుకాణాలు, మాల్స్, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో  మాస్కులు ధరించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది.


More Telugu News