సంక్రాంతి సీజన్ వచ్చేసింది... హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీగా పెరిగిన రద్దీ
- ఈ నెల 14న భోగి, 15న సంక్రాంతి
- ఓవైపు కరోనా విజృంభణ
- వర్క్ ఫ్రం హోం విధానంలో కంపెనీల కార్యకలాపాలు
- విద్యాసంస్థలకు సెలవులు
- సొంతూర్లకు పయనమవుతున్న ప్రజలు
ఈ నెల 14న భోగి, 15న సంక్రాంతి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ నెలకొంది. హైదరాబాదు నగరం నుంచి సొంతూర్లకు వెళ్లేందుకు ప్రజలు ప్రయాణాలకు తెరలేపారు. దాంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. పలు టోల్ ప్లాజాల వద్ద భారీ రద్దీ కనిపిస్తోంది. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ లేన్లు ఉండడంతో వాహనాలు త్వరితగతిన టోల్ ప్రక్రియ ముగించుకుని వెళ్లిపోతున్నాయి.
ఓవైపు కరోనా మళ్లీ ప్రబలుతుండడం, పలు సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ కు మొగ్గుచూపడం, పిల్లలకు సెలవులు కారణంగా సొంతూరు బాటపడుతున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. చాలామంది సొంత వాహనాల్లో వస్తుండడంతో ఎన్.హెచ్.65పై ట్రాఫిక్ పెరిగింది. అటు, వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో అధికారులు పలు టోల్ ప్లాజాల వద్ద చెల్లింపు కేంద్రాల సంఖ్యను పెంచారు.