బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా
- అభ్యర్థులు, కార్యకర్తల రక్షణపై ఈసీ దృష్టి పెట్టాలి
- ప్రికాషనరీ డోసులు ఇవ్వాలని డిమాండ్
- కేసులు పెరిగిపోవడంపై ఆందోళన
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆదివారం ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఆయన స్వయంగా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ తాలూకు బలమైన లక్షణాలతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల తరుణంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం పట్ల వరుణ్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ కార్యకర్తల రక్షణ కోసం ఈసీ చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.
‘‘కరోనా మూడో విడత, ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం. ఎన్నికల అభ్యర్థులు, కార్యకర్తలకు ప్రికాషనరీగా (ముందస్తు) కరోనా టీకా డోసులను ఇచ్చే చర్యలను ఈసీ తీసుకోవాలి’’అని వరుణ్ గాంధీ కోరారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పౌరులకు టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలంటూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఈసీ ఇప్పటికే కోరింది.