మోదీ కోసం రేపు తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు
- బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహణ
- పంజాబ్ ఘటన నేపథ్యంలో హోమాలు
- రేపు ఉదయం 11 గంటల నుంచి నిర్వహణ
- హైదరాబాద్ లో మృత్యుంజయ హోమం చేయనున్న బండి సంజయ్
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నారు. ఇటీవల పంజాబ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. దీంతో మోదీ కోసం మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. జిల్లా, మండల స్థాయి నేతలకు ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేత లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ హోమాలు నిర్వహించాలని చెప్పారు. ఇందులో భాగంగా హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో మృత్యుంజయ హోమానికి బండి సంజయ్ హాజరు కానున్నారు. ప్రధానికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుతూ ఈ హోమం చేయనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు