ఏపీలో 28కి చేరిన ఒమిక్రాన్ కేసులు
- భారత్‌లో 3,623 ఒమిక్రాన్ కేసులు
- అత్యధికంగా మహారాష్ట్రలో 1,009
- ఢిల్లీలో 513 ఒమిక్రాన్ కేసులు
- తెలంగాణ, తమిళనాడు, హర్యానాలో 123 చొప్పున నమోదు
దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో 3,623 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1,009, ఢిల్లీలో 513 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. తెలంగాణ, తమిళనాడు, హర్యానాలో 123 ఒమిక్రాన్ కేసుల చొప్పున నమోదయ్యాయని చెప్పింది. కర్ణాటకలో 441, రాజస్థాన్‌లో 373, కేరళలో 333, గుజరాత్‌లో 204, ఒమిక్రాన్ బాధితుల్లో 1,409 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.