ఫిబ్రవరి 15 నాటికి దేశంలో పతాకస్థాయికి చేరుకోనున్న థర్డ్‌వేవ్

  • మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న కరోనా మహమ్మారి
  • దేశంలో మళ్లీ లక్ష మార్కు దాటిన కేసులు
  •  దేశంలో 50 శాతానికిపైగా వ్యాక్సినేషన్ పూర్తి
దేశంలో మరోమారు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ వేలాదిమందికి సంక్రమిస్తోంది. గత నెల వరకు అంతంతమాత్రంగానే నమోదైన కేసులు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య ఇప్పటికే లక్ష దాటేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15 నాటికి దేశంలో థర్డ్‌వేవ్ పతాక స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ మద్రాస్ గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా పేర్కొన్నారు. కంప్యుటేషనల్ అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు.

ప్రజలు భౌతిక దూరాన్ని విస్మరించడం, గతంలోలా కరోనా ఆంక్షలు లేకపోవడంతో థర్డ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగానే ఉంటుందని, రెండో వేవ్‌తో పోలిస్తే భారీ స్థాయిలోనే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. అయితే, దేశ జనాభాలో 50 శాతానికి పైగా టీకా వేసుకోవడంతో రెండో వేవ్‌తో పోలిస్తే థర్డ్‌వేవ్ తీవ్రత మాత్రం కొంత తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు.


More Telugu News