తెలంగాణలో మరో 2,606 కరోనా పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 73,156 కరోనా పరీక్షలు
- మరోసారి 2 వేలకు పైన పాజిటివ్ కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,583 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 12,180 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. మరోసారి 2 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 73,156 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,583 మందికి కరోనా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 292, రంగారెడ్డి జిల్లాలో 214 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 285 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,92,357 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,76,136 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12,180కి చేరింది. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,041కి పెరిగింది.