'రౌడీ బాయ్స్' ట్రైలర్ ఆవిష్కరించిన జూనియర్ ఎన్టీఆర్

  • ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా 'రౌడీ బాయ్స్'
  • కాలేజి బ్యాక్ డ్రాప్ లో చిత్రం
  • దిల్ రాజు బ్యానర్ లో నిర్మాణం
  • ఈ నెల 14న విడుదలకు సిద్ధం
ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రౌడీ బాయ్స్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించారు. ట్రైలర్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఎన్టీఆర్, ట్రైలర్ చూస్తుంటే హిట్ ఖాయమనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న ఆశిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, దర్శకుడు శ్రీహర్ష, హీరోయిన్ అనుపమ, ఇతర చిత్రబృందానికి ఎన్టీఆర్ గుడ్ లక్ చెప్పారు.

'రౌడీ బాయ్స్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. కాలేజి నేపథ్యంలో యూత్ ఫుల్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


More Telugu News