ప్రధాని మోదీ నటనలో నేచురల్ స్టార్ నానిని మించిపోతున్నారు: సీపీఐ నారాయణ

  • పంజాబ్ ఘటనపై నారాయణ స్పందన
  • మోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్య  
  • హత్యాయత్నం అంటూ కొత్తడ్రామా ప్రారంభించారని విమర్శలు  
పంజాబ్ లో రైతుల నిరసనను తనపై హత్యాయత్నంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సానుభూతి పొందేందుకు ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తీరు చూస్తుంటే నటనలో నేచురల్ స్టార్ నానిని మించిపోతున్నారని అన్నారు.

ఇటీవల ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో రైతుల సెగ చవిచూసిన సంగతి తెలిసిందే. ఫిరోజ్ పూర్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ని రైతులు అడ్డగించడంతో, ఆయన ఓ ఫ్లైఓవర్ పై దాదాపు 20 నిమిషాల పాటు ఎటూ కదల్లేకపోయారు. చివరికి ఆయన కాన్వాయ్ వెనుదిరగాల్సి వచ్చింది.

ఇక, సీపీఐ నారాయణ ఇతర అంశాలపైనా స్పందించారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ విధానం బాగుందని, ఇళ్ల రేటు పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ మంచి సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నా, పాలనాపరమైన వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని నారాయణ పేర్కొన్నారు.


More Telugu News