మీ మౌనం విద్వేష గొంతుకలను మరింత పెంచుతోంది.. ప్రధాని మోదీకి ఐఐఎం విద్యార్థులు, సిబ్బంది లేఖ

  • అహ్మదాబాద్, బెంగళూరు ఐఐఎంల నుంచి బహిరంగ లేఖ
  • విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠినంగా ఉండాలని విజ్ఞప్తి
  • లేదంటే దేశ ఐక్యత, సమగ్రతకే పెను ప్రమాదమని కామెంట్
ప్రధాని నరేంద్ర మోదీకి ఐఐఎం విద్యార్థులు, సిబ్బంది బహిరంగ లేఖ రాశారు. ఇటీవల హరిద్వార్ లో జరిగిన కార్యక్రమంలో సంత్ కాళీ చరణ్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలపై ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరుకు చెందిన 183 మంది ఈ లేఖను రాశారు. హిందూయిజం రక్షణకు హిందూ నేతనే ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ గారూ.. మీ మౌనం విద్వేషం నిండిన గొంతులను మరింత పెంచుతోంది. అది మన దేశ ఐక్యత, సమగ్రతకే పెను ప్రమాదం. మనల్ని విడగొట్టాలని చూసే అలాంటి గొంతులపై కఠిన చర్యలు తీసుకోండి. కులాలు, మతాలవారీగా హింసను పెంచే విద్వేష ప్రసంగాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. చర్చిలు సహా ప్రార్థనా మందిరాలను ఇటీవల తగులబెడుతున్న సందర్భాలున్నాయని, దీంతో దేశంలో ఓ రకమైన భయం వెంటాడుతోందని వారు పేర్కొన్నారు. 


More Telugu News