కుక్క పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ పార్టీ.. ఖర్చు రూ.7 లక్షలు
- అహ్మదాబాద్ లో ఓ కుటుంబం చేసిన వేడుక
- భారీ అలంకరణ, దారి వెంట కుక్క పోస్టర్లు
- వచ్చిన వారికి చక్కని విందు
పెంపుడు జంతువులను ప్రేమించే వారు చాలా మంది కనిపిస్తుంటారు. కానీ, కొద్ది మంది వీటిని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. వాటికోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు. అలాగే గుజరాత్ లోని అహ్మదాబాద్ పట్టణంలో ఒక కుటుంబం తమ పెంపుడు శునకం పుట్టిన రోజు సందర్భంగా పెద్ద వేడుక నిర్వహించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అహ్మదాబాద్ లోని నికోల్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబం శుక్రవారం నిర్వహించిన ఈ శునక పుట్టిన రోజు పార్టీ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుక్క పుట్టిన రోజుకు ఇంత హంగామా చేస్తారా..? అంతేసి ఖర్చు పెడతారా? అంటూ ఆశ్చర్యంతో కూడిన ప్రశ్నలు యూజర్ల నుంచి వస్తున్నాయి.
సదరు కుటుంబం పట్టణ శివారులోని మధుబన్ గ్రీన్ లో పెద్ద ప్లాట్ ను పార్టీ కోసం బుక్ చేసుకుంది. చాలా గ్రాండ్ గా డెకరేట్ చేసి.. దారి పొడవునా పెంపుడు శునకం ‘అబ్బీ’ ఫొటోలతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. బెలూన్లతో ఆకర్షణీయంగా వేదికను డిజైన్ చేశారు. వచ్చిన వారికి మంచి విందు పార్టీ ఏర్పాటు చేశారు.
ఇందుకోసం రూ.7 లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం. పార్టీకి కొందరిని అతిథులుగా పిలిచారు. ఈ హంగామా, ఖరీదైన వ్యవహారం చూసి ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. ఆ పెంపుడు శునకం అబ్బీ ఎంత ఉబ్బి తబ్బిబ్బయిందో మరి.!