వీళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: చంద్రబాబు మండిపాటు
- కుప్పంలో చంద్రబాబు రోడ్ షో
- వైసీపీ నేతల తీరుపై మండిపాటు
- ఏపీలో ఎస్సీలపై దాడులు
- చంపేసుకుంటూ పోతే అడిగేవారు లేరనుకున్నారా?
- ఒక ఎస్సీ మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారని ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ... ఏపీలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని చెప్పారు. ఎస్సీలను చంపేసుకుంటూ పోతే అడిగేవారు లేరనుకున్నారా? అని ఆయన నిలదీశారు.
కొందరు ఎస్సీలు వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒక ఎస్సీ మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారని ఆయన చెప్పారు. సీఎం జగన్ మాత్రం మాస్కు పెట్టుకోరని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని, వారి మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు రోడ్ షోలో భాగంగా స్థానికులతో మాట్లాడారు. తాము వైసీపీ నేతల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొందరు ఎస్సీలు చంద్రబాబు నాయుడితో చెప్పారు.
కాగా, పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని మోదీ భద్రత విషయం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రధాని భద్రత అంటే జాతీయ భద్రతగా పరిగణించాలని చంద్రబాబు చెప్పారు.