జనసేన పార్టీ రాష్ట్ర సమావేశం వాయిదా
- కరోనా కేసులు పెరిగిపోవడంతో నిర్ణయం
- ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి
- మాస్క్ విధిగా ధరించాలి
- అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచన
కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించాల్సిన జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి సి.హరిప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను శనివారం విడుదల చేశారు.
‘‘ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించాల్సిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. కోవిడ్ వ్యాప్తి మూలంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున సమావేశాన్ని వాయిదా వేశారు.
సంక్రాంతి సంబరాల సమయంలో కరోనా కేసులు వ్యాప్తి చెందడం బాధాకరమని.. ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరారు’’ అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.