ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం కేసు.. 150 మందిపై కేసుల నమోదు

  • ఫిరోజ్ పూర్ జిల్లా కుల్ గరి పీఎస్ లో కేసుల నమోదు
  • ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్టు కేంద్రానికి పంజాబ్ ప్రభుత్వం నివేదిక
  • ఎఫ్ఐఆర్ లలో మోదీ పేరును ప్రస్తావించని వైనం
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం పెను దుమారాన్ని రేపుతోంది. పంజాబ్ ఫిరోజ్ పూర్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ను రైతులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలిపి కాన్వాయ్ ముందుకు సాగకుండా చేశారు. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రధాని దాదాపు 20 నిమిషాల సేపు తన వాహనంలోనే కూర్చుండిపోయారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు.

మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఫిరోజ్ పూర్ పోలీసులు 150 మందిపై కేసులు నమోదు చేశారు. కుల్ గరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ, కేంద్రానికి పంజాబ్ ప్రభుత్వం నివేదిక పంపింది. అయితే, ఎఫ్ఐఆర్ లలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.


More Telugu News