చాపకింద నీరులా మహమ్మారి.. ఈ నెలాఖరుకు రోజుకు 4 నుంచి 8 లక్షల కేసులు: ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్చరిక

  • ఢిల్లీ, ముంబై నగరాల్లో ప్రమాదకర స్థాయికి కరోనా 
  • మార్చి తర్వాత థర్డ్‌వేవ్ ఉండకపోవచ్చన్న ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్
  • ఆంక్షలు విధిస్తే వైరస్ మాయం కాదని స్పష్టీకరణ
దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మరోమారు మోగుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి కారణంగా ఈ నెలాఖరు నాటికి రోజుకు 4 నుంచి 8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూరు ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఇప్పటికే ఆందోళనకర స్థాయిలో కేసులు నమోదవుతుండగా, వచ్చే పది రోజుల్లో ఈ రెండు నగరాల్లో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయన్నారు.

అయితే, థర్డ్‌వేవ్‌పై భయపడాల్సింది ఏమీ లేదని, మార్చి తర్వాత ఇది ఉండకపోవచ్చని అన్నారు. కేసులు మరింత పెరగకుండా ఉండేందుకు లాక్‌డౌన్ వంటి ఆంక్షలు విధిస్తే వేవ్ ఆలస్యమవుతుంది తప్పితే కరోనా మాయం కాదని అన్నారు. థర్డ్ వేవ్‌లో కేసుల సంఖ్య అమాంతం పెరిగినప్పటికీ వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం స్వల్పంగానే ఉంటుందని ప్రొఫెసర్ మణీంద్ర వివరించారు.


More Telugu News