అధికారులు తనిఖీ చేస్తారన్న భయంతో సెల్ ఫోన్ మింగేసిన ఖైదీ
- ఢిల్లీలోని తీహార్ జైల్లో ఘటన
- ఫోన్ ఉపయోగిస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ
- ఖైదీని ఆసుపత్రికి తరలించిన అధికారులు
ఢిల్లీలోని తీహార్ జైల్లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. అధికారులు తనిఖీ చేస్తారన్న భయంతో ఓ ఖైదీ సెల్ ఫోన్ ను మింగేశాడు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ మీడియాకు వివరించారు.
జనవరి 5న ఈ ఘటన జరిగిందని తెలిపారు. జైలు నెం.1లో ఓ అండర్ ట్రయల్ ఖైదీ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడని జైలు అధికారులకు తెలిసిందని, అయితే, అధికారులు తనను సమీపిస్తుండడంతో ఆ ఖైదీ ఫోన్ ను మింగేశాడని వెల్లడించారు. దాంతో అతడిని డీడీయూ ఆసుపత్రికి తరలించామని, అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. అయితే ఆ ఫోన్ ఇంకా అతడి ఉదరంలోనే ఉందని తెలిపారు.