పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ అవార్డులు: అత్యంత విలువైన క్రికెటర్ గా మహ్మద్ రిజ్వాన్ ఎంపిక!
- టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డూ రిజ్వాన్ కే
- వన్డే క్రికెటర్ అవార్డును అందుకున్న బాబర్ ఆజం
- ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా మహ్మద్ వసీం జూనియర్
2021గానూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించింది. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డును అందుకున్నాడు. గత ఏడాది 9 టెస్టులు ఆడి 455 పరుగులు, 6 వన్డేల్లో 134 పరుగులు, 29 టీ20ల్లో 1,326 రన్స్ తో పాటు కీపింగ్ లో 56 మంది బ్యాటర్లను ఔట్ చేసిన అతడిని మోస్ట్ వాల్యుయేబుల్ క్రికెటర్ గా ఎంపిక చేసింది. అంతేగాకుండా టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డునూ రిజ్వాన్ అందుకున్నాడు.
అలాగే, బాబర్ ఆజం, షహీన్ అఫ్రిదీలకు కూడా అవార్డులను ప్రదానం చేసింది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ మీద 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన షహీన్ అఫ్రిదీని ప్రభావవంతమైన ప్రదర్శన చేసిన ఆటగాడిగా అవార్డిచ్చింది. 6 వన్డేల్లో 405 పరుగులు చేసిన బాబర్ ఆజంను వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది.
15 వికెట్లు పడగొట్టిన మహ్మద్ వసీం జూనియర్ కు ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డిచ్చింది. 9 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టిన హసన్ అలీని టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. అతడు ఐదు సార్లు 5 వికెట్లు పడగొట్టగా, ఒకసారి పది వికెట్లు తీశాడు. కాగా, 10 వన్డేల్లో 363 పరుగులతో పాటు 6 వికెట్లు, 6 టీ20ల్లో 95 పరుగులు చేసి 5 వికెట్లు తీసిన నిదా దార్ ను విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేసింది.