ప్రధాని భద్రతా వైఫల్యంపై ఘాటుగా స్పందించిన సీఎం నవీన్ పట్నాయక్

  • మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం
  • ప్రధానికి తగిన భద్రతను కల్పించడం అన్ని ప్రభుత్వాల విధి  
  • రాజ్యాంగ గౌరవాన్ని కాపాడటం ప్రతి ప్రభుత్వ విధి అని వ్యాఖ్య
పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భద్రతా వైఫ్యలం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆయన కాన్వాయ్ ని రైతులు అడ్డగించడంతో రోడ్డుపైనే 20 నిమిషాలు ఆగిపోయిన ప్రధాని... ఘటనాస్థలి నుంచి తిరుగుపయనమయ్యారు. భద్రతా వైఫల్యంపై పెద్ద స్థాయిలో వివర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు ప్రధానికే భద్రతను కల్పించలేకపోయారంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఈ వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. పంజాబ్ కు చెందిన పోలీసు ఉన్నతాధికారులను ఢిల్లీకి పిలిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మరోవైపు ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. భారత ప్రధానమంత్రి పదవి అనేది రాజ్యాంగబద్ధమైనదని... ఆ పదవిలో ఎవరు ఉన్నా ఆయనకు పూర్తి స్థాయి భద్రతను కల్పించడం, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడటం ప్రతి ప్రభుత్వ విధి అని ఆయన అన్నారు. దీనికి విరుద్ధమైన ఏ ప్రక్రియ కూడా మన ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News