శ్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ వివాదం.. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు
- పుట్టపర్తిలోని శ్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ నిర్మాణానికి చర్యలు
- ఆందోళనలకు పిలుపునిచ్చిన టీడీపీ
- పల్లె రఘునాథరెడ్డి, కాలువ శ్రీనివాసులు అరెస్టు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ నిర్మించాలంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ నిర్మించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. శ్మశాన వాటికలో ఇప్పటికే హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం సమాధులను తవ్వేసి చదును చేశారని చెప్పారు. చివరకు శ్మశానాలను కూడా వైసీపీ ప్రభుత్వం వదల్లేదని మండిపడ్డారు.
పుట్టపర్తిలో ఈ రోజు టీడీపీ నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆందోళనలకు వెళ్లకుండా టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పల్లె రఘునాథరెడ్డి, కాలువ శ్రీనివాసులును అరెస్టు చేశారు. బుక్కరాయపాలెంలో పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇళ్లకు తరలించి గృహ నిర్బంధం చేయనున్నారు.
కాగా, పుట్టపర్తిలో హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు సమాధులు తొలగించారని స్థానికులు అంటున్నారు. అయితే, ఇప్పటికే హెల్త్ క్లినిక్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని వైసీపీ నేతలు చెప్పారు.