పాలసీదారులకు పరిహారం చెల్లింపుల్లో ఏ కంపెనీలు ముందున్నాయి?
- టాప్ 5లో మ్యాక్స్ లైఫ్, ఏగాన్
- భారతీ ఆక్సా, ఎల్ఐసీ, ప్రమెరికా లైఫ్
- చెల్లింపుల్లో ఎస్ బీఐ లైఫ్ లాస్ట్
- కోవిడ్ క్లెయిమ్ లు 21,836
- వీటిల్లో 21,304 పరిష్కారం
బీమా పాలసీ తీసుకునేది ఎందుకు.. దురదృష్టం కాటేస్తే కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనేగా? కానీ, తీరా పాలసీదారు అకాల మరణంతో దూరమైన సందర్భాలలో కుటుంబ సభ్యులు క్లెయిమ్ కోసం దాఖలు చేస్తే.. సకాలంలో పరిహారం చెల్లించకపోతే ఎలా..? ఆ ఇబ్బందిని వర్ణించలేము. అందుకే క్లెయిమ్ చెల్లింపుల చరిత్ర మెరుగ్గా ఉన్న కంపెనీల నుంచే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
కరోనా మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకోవడం చూశాం. ఈ కాలంలో కంపెనీల చెల్లింపులు ఎలా ఉన్నదీ తెలుసుకోవడం ముఖ్యం. దీనిపై బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్ డీఏఐ) 2020-21 నివేదికను విడుదల చేసింది. ఇందులో బీమా సంస్థల క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో తదితర సమగ్ర వివరాలు ఉన్నాయి.
వ్యక్తులకు సంబంధించి దాఖలైన క్లెయిమ్ లలో అత్యధికంగా పరిష్కరించి (మొత్తం పాలసీల పరంగా), చెల్లింపులు చేయడంలో మ్యాక్స్ లైఫ్ మొదటి స్థానంలో ఉంది. 99.35 శాతం క్లెయిమ్ లకు చెల్లింపులు చేసింది. 0.64 శాతం క్లెయిమ్ లను తిరస్కరించింది. చెల్లింపులతోపాటు తిరస్కరణలు ఎన్నున్నదీ చూడాల్సి ఉంటుంది. ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 99.25 శాతం క్లెయిమ్ లను పరిష్కరించి 0.75 శాతం క్లెయిమ్ లకు 'నో' చెప్పింది.
భారతీ ఆక్సా లైఫ్ 99.05 శాతం చెల్లింపులతో మూడో స్థానంలో ఉంది. ఈ సంస్థ 0.95 శాతం క్లెయిమ్ లను తిరస్కరించింది. ఎల్ఐసీ 98.62 శాతం క్లెయిమ్ లకు చెల్లింపులు చేసి, 0.69 శాతం క్లెయిమ్ లను తిరస్కరించింది. ప్రమెరికా లైఫ్ 98.61 శాతం చెల్లింపులతో ఐదో స్థానంలో ఉంది. 1.24 శాతం చెల్లింపులను ఇది తిరస్కరించింది.
ఎక్సైయిడ్ లైఫ్, కోటక్ మహీంద్రా, రిలయన్స్ నిప్పన్, బజాజ్ అలియాంజ్, పీఎన్ బీ మెట్ లైఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, టాటా ఏఐఏ, అవీవా, హెచ్ డీఎఫ్ సీ లైఫ్ కంపెనీల చెల్లింపులు 98 శాతానికి పైన ఉన్నాయి. పరిహారం చెల్లింపుల్లో విలువ పరంగా టాప్-5లో ఏగాన్, బారతీ ఆక్సా, సహారా, ప్రమెరికా లైఫ్, ఎల్ఐసీ ఉన్నాయి. అతి తక్కువ చెల్లింపులు చేసిన (93శాతం) కంపెనీగా ఎస్ బీఐ లైఫ్ నిలిచింది.
2020-21లో కరోనా మరణాలకు సంబంధించి పరిహారం కోరుతూ 21,836 క్లెయిమ్ లు దాఖలయ్యాయి. వీటికి సంబంధించిన మొత్తం బీమా విలువ రూ.1,617 కోట్లు. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 21,304 క్లెయిమ్ లు ఆమోదం పొందాయి. వీటికి సంబంధించి పరిహారం రూ.1,418 కోట్లుగా ఉంది. రూ.81 పరిహారానికి సంబంధించి 175 క్లెయిమ్ లు తిరస్కరణకు గురయ్యాయి. రూ.117 కోట్ల పరిహారానికి సంబంధించి 357 క్లెయిమ్ లు పరిష్కారం కావాల్సి ఉంది.