ఇంటర్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

  • ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేసిన ప్రభుత్వం
  • రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు రద్దు చేసుకునే అవకాశం
  • రద్దు చేసుకున్న వారికి డబ్బును తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటన
ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్రమంలో తాజాగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారు... తమ దరఖాస్తును రద్దు చేసుకోవడానికి ఈ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. దీని కోసం చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ప్రకటించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలేజీ ప్రిన్సిపాళ్ల వద్ద నుంచి డబ్బును తీసుకోవచ్చని తెలిపింది.

అంతేకాదు ఈరోజు నుంచి విద్యార్థులంతా మార్కుల మెమోలను పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in నుంచి మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.


More Telugu News