సంక్రాంతి ప్రయాణికుల కోసం.. విశాఖ-యలహంక మధ్య 16, 17వ తేదీల్లో ప్రత్యేక రైళ్లు
- 16న మధ్యాహ్నం విశాఖలో, 17న ఉదయం యలహంకలో బయలుదేరనున్న రైళ్లు
- దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు మీదుగా ప్రయాణం
- సద్వినియోగం చేసుకోవాలన్న రైల్వే
సంక్రాంతి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 16, 17 తేదీల్లో విశాఖపట్టణం-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 16న విశాఖపట్టణం నుంచి మధ్యాహ్నం 3.55 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు యలహంక చేరుకుంటుంది.
17న ఉదయం 10.15 గంటలకు యలహంకలో బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 5 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జాలర్‌పేట, కృష్ణరాజపురం మీదుగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.