యంగ్ హీరోతో గీతా ఆర్ట్స్ 2 మూవీ!
- 'రాజావారు రాణిగారు'తో పరిచయం
- ఎస్. ఆర్. కల్యాణ మంటపం'తో సక్సెస్
- రిలీజ్ కి రెడీగా 'సమ్మతమే'
- రేపు కొత్త సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు నిర్మితమవుతూ ఉంటాయి. అల్లు అరవింద్ - బన్నీ వాసు ఇద్దరూ కూడా కొత్త దర్శకులను .. కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ ఏడాదిలో ఈ బ్యానర్ లో మరో సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కిరణ్ అబ్బవరం హీరోగా ఈ బ్యానర్ పై ఒక సినిమా చేయనున్నారు. ఈ బ్యానర్ లో నిర్మితమవుతున్న 7వ సినిమా ఇది. అదే విధంగా కెరియర్ పరంగా కూడా కిరణ్ అబ్బవరానికి ఇది 7వ సినిమానే. ఈ సెంటిమెంట్ తోనే కావచ్చునేమో రేపు ఉదయం 10:19 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.
అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను కూడా రేపు వెల్లడించనున్నారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగు తెరకి కిరణ్ అబ్బవరం పరిచయమయ్యాడు. ఇక ఈ మధ్యన వచ్చిన 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' సినిమా సక్సెస్ ను సాధించింది. ఆయన తాజా చిత్రంగా 'సమ్మతమే' రిలీజ్ కి రెడీగా ఉంది. మరో మూడు ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గీతా ఆర్ట్స్ 2లో ఛాన్స్ కొట్టేశాడు.