సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ప్రారంభం
- డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న ఉద్యోగులు
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ
- చర్చలకు హాజరైన 13 ఉద్యోగ సంఘాల నేతలు
- ప్రభుత్వం తరఫున సీఎస్, సజ్జల హాజరు
అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలకు వచ్చారు. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి తదితరులు చర్చలకు వచ్చారు. ప్రభుత్వం తరఫున సీఎస్ సమీర్ శర్మ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా 71 డిమాండ్లపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ తో చర్చించనున్నారు.