ఆత్మహత్య వివాదంలో తనయుడు... బహిరంగ లేఖ రాసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
- పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య
- వనమా తనయుడు రాఘవేందర్ పై తీవ్ర ఆరోపణలు
- పరారీలో రాఘవేందర్
- తనయుడు విచారణకు సహకరించేలా చూస్తానన్న వనమా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్యకు కారకుడంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్ పై తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే. భార్య గురించి ఏ భర్త వినకూడని మాటలు రాఘవేందర్ నోటి నుంచి విన్నానంటూ ఆ కుటుంబ యజమాని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. అటు, రాఘవేందర్ పరారీలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ ద్వారా స్పందించారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తుకు నా కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటా అని హామీ ఇచ్చారు. పార్టీకి, నియోజకవర్గానికి తన కుమారుడ్ని దూరంగా ఉంచుతానని తెలిపారు.