గుజ‌రాత్‌లో కెమికల్ ట్యాంకర్​ నుంచి గ్యాస్ లీక్‌.. ఆరుగురి మృతి.. 20 మందికి అస్వ‌స్థ‌త‌

  • తెల్ల‌వారుజామున ఘ‌ట‌న‌
  • రోడ్డు ప‌క్క‌న ట్యాంక‌ర్
  • మిల్లులో ఉన్న వారికి కూడా ఊపిరాడక ఇబ్బందులు  
గుజరాత్ సూర‌త్‌లో సచిన్ జీఐడీసీ ప్రాంతంలోని ఓ కంపెనీ స‌మీపంలో ఈ రోజు తెల్ల‌వారుజామున‌ కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువు లీకై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదంలో మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంట‌నే వారిని స్థానికులు, స‌హాయ‌క సిబ్బంది ఆసుప‌త్రుల‌కు తరలించారు. రోడ్డుపక్కన పార్కు చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ పైపు లీకై ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు స‌మాచారం.

ట్యాంకర్ నుంచి విషవాయువు రావంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. విశ్వప్రేమ్ మిల్లులో పని చేసే కార్మికులు ఆ వాయువు పీల్చడంతో సృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయారు. కెమికల్ ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో వారు ఆ స‌మ‌యంలో నిద్రిస్తున్న‌ట్లు తెలిసింది. మిల్లులో ఉన్న వారు కూడా ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.


More Telugu News