పంజాబ్ లో ఆగడాలకు చెక్ పెట్టకుంటే.. భారీ మూల్యమే చెల్లించుకోవాలి: కంగనా రనౌత్
- ప్రధాని మోదీపై దాడి ప్రతీ భారతీయునిపై దాడే
- 140 కోట్ల మందికి ఆయన ప్రతినిధి
- టెర్రరిస్ట్ కార్యకలాపాలకు రాజధానిగా పంజాబ్
- వాటికి ఇప్పుడే చెక్ పెట్టేయాలంటూ పోస్ట్
పంజాబ్ రాష్ట్రంలో బుధవారం ప్రధాని నరేంద్రమోదీని రైతులు దారిమధ్యలో అడ్డగించడంపై నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రజలందరికీ ప్రతినిధి అయిన అత్యంత ముఖ్యమైన వ్యక్తికి పటిష్ఠ భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. దీన్ని సిగ్గుచేటుగా ఆమె అభివర్ణించారు.
‘‘పంజాబ్ లో జరిగినది నిజంగా అవమానకరం. గౌరవనీయ ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నేత, ప్రతినిధి. 140 కోట్ల ప్రజల గొంతుక. ఆయనపై దాడి అంటే ప్రతీ భారతీయుడిపై దాడి అవుతుంది. ఇది మన ప్రజాస్వామ్యంపైనే దాడి. పంజాబ్ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. వారిని ఇప్పుడు కనుక నిలువరించకపోతే.. తర్వాత దేశం మొత్తం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మోదీకి అండగా భారత్ నిలుస్తుంది’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు.