చిరంజీవి 'ఆచార్య' సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్ఎంపీ డాక్టర్లు
- 'ఆచార్య' సినిమా నుంచి 'శానా కష్టం' పాట విడుదల
- లిరిక్ తమను అవమానించేలా ఉందని ఆర్ఎంపీల అభ్యంతరం
- దర్శకుడు, గీత రచయితపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య' విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 4న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఐటెం సాంగ్ 'శానా కష్టం'కు ఆడియెన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే ఈ సాంగ్ వల్లే ఈ సినిమాకు ఒక సమస్య వచ్చి పడింది.
ఈ పాటలోని లిరిక్ లో... 'ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారే' అనే లైన్ ఉంది. అంటే... అందమైన అమ్మాయిలను టచ్ చేయవచ్చనే ఉద్దేశంతో కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారనే విధంగా ఆ లిరిక్ ఉంది. దీనిపై ఆర్ఎంపీ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వృత్తిని అవమానించేలా పాట ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని జనగామకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గీత రచయిత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ పాటకు భాస్కరబట్ల లిరిక్స్ అందించారు.