శిశువులపై కరోనా వైరస్ ప్రభావం.. తాజా అధ్యయనంలో గుర్తింపు!

  • న్యూయార్క్ లో 255 మంది శిశువులపై అధ్యయనం
  • కరోనాకు ముందు పుట్టిన పిల్లలతో పోలిస్తే కాస్త వెనుకడుగు
  • టాస్క్ లు నిర్వహించే విషయంలో తక్కువ స్కోరు
గర్భంలోని శిశువులపై కరోనా వైరస్ ప్రభావం ఉండదన్నది గత అధ్యయనాల మాట. కానీ, జన్మించిన తర్వాత శిశువుల మొదడు ఎదుగుదలపై ప్రభావం కనిపిస్తోందని జామా పెడియాట్రిక్స్ లో ప్రచురితమైన తాజా అధ్యయన నివేదిక ఒకటి చెబుతోంది.

న్యూయార్క్ నగరంలో తల్లి గర్భంలో పూర్తికాలం ఉండి (9 నెలల పాటు).. కరోనా కాలంలో జన్మించిన 255 మంది శిశువులపై పరిశోధన నిర్వహించారు. ఇందులో 114 మంది కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన తల్లులు ఉన్నారు.

ఆరు నెలలు దాటిన తర్వాత ఆ శిశువుల (వైరస్ సోకిన తల్లుల సంతానం) అభివృద్దిలో సార్స్ కోవ్2 వైరస్ ప్రభావం ఏమీ ఉండడం లేదని అధ్యయనం నిర్వహించిన కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ స్టేట్ సైకియాట్రీ ఇనిస్టిట్యూట్ కు చెందిన డాక్టర్ దని దుమిత్రి తెలిపారు. అయితే కరోనా రాక ముందు జన్మించిన 62 మంది చిన్నారులతో.. కరోనా సమయంలో జన్మించిన పిల్లలను పోల్చి చూసినప్పుడు టాస్క్ లు నిర్వహించే విషయంలో తక్కువ స్కోరు చూపించినట్టు గుర్తించినట్టు చెప్పారు.

ఈ ఫలితాల ఆధారంగా దీర్ఘకాలం పాటు శిశువులపై ప్రభావం కొనసాగుగుతుందని చెప్పలేమని దిమిత్రి అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో జన్మించిన వారి నాడీ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు అధ్యయనంలో తెలిసిందన్నారు.


More Telugu News