కడుపుమండిన రైతన్నలు ప్రధానమంత్రికి సైతం చుక్కలు చూపించారు: షర్మిల
- రైతుల సంక్షేమాన్ని మరవద్దు
- రైతులే రేపు కేసీఆర్ అధికారానికి కర్రుకాల్చి వాత పెడతారు
- వరి కొనకుండా రైతుకు చితి పేర్చకూడదు
- ఈ చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దన్న షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీకి సైతం రైతులు చుక్కలు చూపించారని, కేసీఆర్‌కు కూడా బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.
'అధికారం ఇస్తే ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచి, రైతుల ప్రాణాలతో ఆడుకుంటుంటే, కడుపుమండిన రైతన్నలు ప్రధానమంత్రికి సైతం చుక్కలు చూపించారు. వెనక్కి పంపించారు. తిరగబడ్డ ఈ రైతులే రేపు సీఎం కేసీఆర్ అధికారానికి కర్రుకాల్చి వాత పెడతారు' అని షర్మిల హెచ్చరించారు.
'వరి కొనకుండా రైతుకు చితి పేర్చుతుంటే వీధిన పడ్డ రైతుకు అండగా మేము రైతు ఆవేదన యాత్రతో ధైర్యాన్ని నింపుతుంటే, ఆపడానికి మీరు కరోనా రూల్స్ అడ్డుపెట్టి సంబరపడిపోవచ్చు.. కానీ, మీ నియంత పాలనకు వ్యతిరేకంగా ముంచుకొస్తున్న మరో రైతాంగ పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. ఈ చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు' అని షర్మిల పేర్కొన్నారు.