ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ... పూర్తి వివరాలు ఇవిగో!

  • రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,36,279
  • మహిళా ఓటర్ల సంఖ్య 2,05,97,544
  • అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో పురుష ఓటర్లు ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సీఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,05,97,544 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 4,62,880 ఎక్కువ. మరోవైపు ఏపీ ఓటర్లలో 7,033 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు... 67,935 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.

తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ, కృష్ణా జిల్లాలు అత్యధిక ఓటర్ల జాబితాలో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 43,45,322 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 352 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉండటం గమనార్హం. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.


More Telugu News