'పుష్ప' ఓటీటీ విడుద‌ల‌.. అధికారికంగా ప్ర‌క‌ట‌న‌

  • అత‌డు పోరాడ‌తాడు.. ప‌రిగెడ‌తాడు..
  • ఎగిరి దూకుతాడు.. అంతేగానీ, ఎప్ప‌టికీ త‌గ్గేదేలే
  • అంటూ అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టన‌
  • ఈ నెల 7న త‌మ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంద‌ని వివ‌ర‌ణ‌
బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళ్తున్న‌ పుష్ప ఇప్పుడు ఓటీటీలోనూ సంద‌డి చేయ‌నుంది. ఎర్ర చంద‌నం చుట్టూ తిరిగే క‌థాంశంతో హీరో అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'పుష్ప' గ‌త‌ నెల 17న థియేట‌ర్ల‌లో విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నెల 7 నుంచి ఓటీటీలోనూ ఈ సినిమా ప్ర‌సారం కానుంద‌ని అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

'అత‌డు పోరాడ‌తాడు.. ప‌రిగెడ‌తాడు.. ఎగిరి దూకుతాడు.. అంతేగానీ, ఎప్ప‌టికీ త‌గ్గేదేలే' అంటూ పుష్ప రాజ్ ఓటీటీలో అడుగుపెడుతున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది. తెలుగు, త‌మిళం, మలయాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా ఈ నెల 7న రాత్రి 8 గంట‌ల నుంచి త‌మ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంద‌ని వివ‌రించింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

       


More Telugu News