సౌరవ్ గంగూలి కుమార్తెకు కూడా కరోనా

  • పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ 
  • ఎటువంటి లక్షణాలు లేవు
  • ఇంట్లోనే ఐసోలేషన్
  • గంగూలీ భార్య డోనాకు నెగెటివ్
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుమార్తె, సన గంగూలీ (20) సైతం కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె ఇంట్లోనే ఐసోలేషన్ లోకి వెళ్లిపోయింది. కాకపోతే ఆమెకు ఎటువంటి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు.

ఇక గంగూలీ భార్య డోనాకు చేసిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. సౌరవ్ గంగూలీ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడడం తెలిసిందే. కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్ష చేయించుకోగా డెల్టా రకం అని తేలింది. ఆ సమయంలో ఆయనకు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ తో వైద్యులు చికిత్స చేశారు.


More Telugu News